ఉగ్రమూకలకు గుణపాఠం
- ఉగ్రవాదానికి ఆశ్రయమిచ్చే శక్తులకు సిందూర్ హెచ్చరిక
- బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు
హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): ఆపరేషన్ సిందూర్ భారత శౌర్యానికి నిదర్శనమని, ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చే శక్తుల కు ఇది గట్టి హెచ్చరిక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. పాకి స్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తూ భారతసైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబురాలు నిర్వహించారు.
అంతకుముందు ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంచందర్ పహల్గామ్ దాడికి ప్రతీ కారంగా లష్కర్, జైష్ వంటి ఉగ్రవాద శిబిరాలపై భారతసైన్యం విరుచుకుపడి ఉగ్రవా దులను మట్టుబెట్టారని తెలిపారు. ఈ విజ యం దేశ భద్రత పట్ల నరేంద్ర మోదీ ప్రభు త్వ కఠిన వైఖరిని చాటిచెబుతోందని పేర్కొన్నారు. భారతీయులను చంపిన వారికి ఇది పాత భారత్ కాదని చాటిచెప్పామన్నారు.






