బీజేపీ ఎన్నడూ దాడులను ప్రోత్సహించదు
- అరాచకాలు, దాడులకు కేరాఫ్ అడ్రస్ బీఆర్‌ఎస్సే
- కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్
సికింద్రాబాద్, మే 7 (విజయక్రాంతి) : బీజేపీ ఎన్నడూ దాడులను ప్రోత్సహించదని.. అరాచకాలు, దాడులకు కేరాఫ్ అడ్రస్ బీఆర్‌ఎస్సే అని.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. కరీంనగర్‌లో ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పై దాడి చేయాలనే ఆలోచనే బీజేపీ కార్యకర్తలకు లేదన్నారు. క్యాంప్ ఆఫీస్ ప్రభుత్వ నిధులతో నిర్మించిందని, అక్కడ బీఆర్‌ఎస్ నాయకులు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి బీజేపీ వారిని బూతులు తిట్టడం కరెక్టా?’ అని ప్రశ్నించారు.
గురువారం సాయంత్రం సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని సురభి గార్డెన్స్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ చేసిన అరా చకాలు ఆ పార్టీ నాయకులకు గుర్తుకు లేవా? కేటీఆర్ సిరిసిల్ల వచ్చినప్పుడల్లా బీజే పీ కార్యకర్తలను పెట్టిన హింసను మరిచిపోయారా? అని మండిపడ్డారు. ప్రజాసంగ్రా మ యాత్రలో తమ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేసిన విషయాన్ని మర్చిపోతామా? ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వడ్ల కొనుగోలు కేంద్రాల పరిశీలనకు వెళ్లినప్పుడు తమపై కర్రలు, రాళ్లతో చేసిన దాడులు గుర్తుకు లేవా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా మహిళా కార్యకర్తలను, రైతులను బీఆర్‌ఎస్ గుండాలు ఎత్తుకుపోయి దాడి చేసిన ఘటనలు ఉన్నాయని.. ఇయాళ సిగ్గులేకుండా బూతులు తిడితే ఊరుకోవాలా? అని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేసి ఇప్పుడు సుద్దపూస లెక్క మాట్లాడితే సరిపోతుందా, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదన్నారు. హద్దుల్లో ఉంటూ హుందాగా వ్యవహరిస్తే మంచిదని, తమ పార్టీ కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దు హెచ్చరించారు.






