17-07-2025 01:30:07 AM
- స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ
- పార్టీ బలహీనంగా ఉన్న చోట ప్రత్యేక ప్రణాళిక
- ఇప్పటికే వర్క్‌షాప్ ఏర్పాటు.. మరిన్ని శిక్షణా శిబిరాలు ఏర్పాటు
హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ ముందుకుసాగుతోంది. అందులో భాగంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఓ రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కిం చుకోవాలని వ్యూహరచన చేస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్నచోట ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించింది.
యువతకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడంతో ద్వారా మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈమేరకు ఇప్పటికే ఈ నెల 15న మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఔషాపూర్‌లో వర్క్‌షాప్ సైతం నిర్వహించారు. ముఖ్యనేతలకు ఈ వర్క్‌షాప్ ద్వారా దిశానిర్దేశం చేశారు. వర్క్‌షాప్‌లో ప్రకటించిన రోడ్ మ్యా ప్ ప్రకారం నేతలు, శ్రేణులు కలిసిమెలిసి కష్టపడి పనిచేయాలని నిర్ణయించారు. బుధ వారం స్థానిక పోరు కోసం శిక్షణా తరగతులు కూడా కొనసాగించారు. ఈ నెల 18 నుంచి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లనున్నాయి.
బలహీనంగా ఉన్నచోట..
ఉత్తర తెలంగాణతో పోలిస్తే దక్షిణ తెలంగాణలో పార్టీ బలహీనంగా ఉందని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. దక్షిణాన ఒక్క మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం తప్ప బీజేపీకి దక్కిందేమీ లేదు. అదే ఉత్తర తెలంగాణలో 7 ఎంపీ, 8 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటింది. ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రెండు స్థానాలను ఉత్తర తెలంగాణలోనే కైవసం చేసుకుంది. అందుకే ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణ జిల్లా ల్లో ఈసారి స్థానిక పోరులో విజయం సా ధించేందుకుగాను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇన్‌చార్జ్‌లుగా నియమించేందుకు పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తోందని సమాచారం.
యువతకు పెద్దపీట..
రాష్ట్రంలో జనం బీజేపీని కోరుకుంటున్నారని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. మె జార్టీ యువత బీజేపీవైపు సానుకూలంగా ఉన్నారని అంచనా వేస్తున్నారు.