17-07-2025 01:29:53 AM
బాలిక వైద్య ఖర్చులకు ఇరవై రెండు వేల ఆర్ధిక సహాయం
మంగపేట,జూలై16(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలం కొత్త మల్లూరు గ్రామానికి చెందిన మాటూరి కోటేశ్వరరావు కూతురు వర్షిత (12)అనుకోకుండా వేడి నీళ్లు పడటంతో శరీరం అంతా కాలిపోయింది.ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది.
వైద్యానికి సుమారుగా లక్ష రూపాయలు దాకా ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు డబ్బుల కొరకు తీవ్ర ఇబ్బంది పడుతున్న కోటేశ్వర్రావు బాధను స్థానిక బీఆర్‌ఎస్ నాయుకులు వెంటనే ములుగు జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబుని,పీఏసీఎస్ చైర్మెన్ తోట రమేష్ ను ,ములుగు జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగ రమేష్ ,బీఆర్‌ఎస్ జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మికి తెలియజేశారు వెంటనే వారు సానుకూలంగా స్పందించి ఇరవై రెండు వేల రూపాయలను బాలిక తండ్రికి స్థానిక బీఆర్‌ఎస్ నాయకుల ద్వారా అందజేశారు .
అడగగానే స్పందించి సాయం అందజేసిన బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు 10వేలు,తోట రమేశ్ 5వేలు ,బాడిశ నాగ రమేష్ 5వేలు ,కొమరం ధనలక్ష్మి 2వేలు ఆర్థిక సహాయం చేసిన వారికి బాలిక కుటుంబ సభ్యులు,స్థానిక బిఆర్‌ఎస్ నాయుకులు,గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా దాతలు బాలిక వైద్యానికి తమ వంతుగా సాయం అందజేయాలని స్థానికులు కోరారు.