25 May, 2026 | 1:05 AM

మరణంలోనూ వీడని వివాహ బంధం

25-05-2026 12:00 AM

‘ఒకే రోజు వృద్ధ దంపతుల మృతి 

ధర్మపురి,మే24(విజయ క్రాంతి):మరణంలోనూ ఒకరిని విడిచి ఒకరు ఉండలే కపోయారు ఆ వృద్ధ దంపతులు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా ధర్మపురి మండ లం దొనూర్ గ్రామంలో ఒకేరోజు వృద్ధ దంపతులిద్దరూ కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వృద్ధుడు జంగం రాజయ్య మరణించగా కొన్ని గంటల వ్యవధిలోనే అత ని భార్య జంగం సాయమ్మ కూడా కన్నుమూశారు. ఒకేరోజు భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందడం గ్రామ ప్రజలను తీవ్ర ది గ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనతో దొ నూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరణంలో సైతం వృద్ధ దంప తులు కలిసి ఉండడాన్ని చూసి గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.