16 August, 2026 | 7:14 PM

ముత్యంపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఏకగ్రీవం

16-08-2026 06:43 PM

కామారెడ్డి, ఆగస్టు 16 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశాల  అనుసారం దోమకొండ మండల కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు ఆశ బోయిన శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఆధ్వర్యంలో ముత్యంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆశ బోయిన అక్షర శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ తాటి పెళ్లి శ్రీకాంత్, సీనియర్ నాయకులు అబ్రబోయిన స్వామి, రాజేందర్ దోమకొండ పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు ముత్యంపేట ముత్త గారి సిద్ధగోడు ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సాకలి నరేష్, విలేజి  ఎన్నుకోవడం జరిగింది.

బిసి సెల్ అధ్యక్షుడు శ్రీహరి గౌడ్, మహిళా సెల్ అధ్యక్షురాలు నాయిని సిద్దవ్వ ,ఎస్సీ సెల్ అధ్యక్షుడు గోండ్ల నాగభూషణం, మైనార్టీ సెల్ అధ్యక్షుడు హామీన్, ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముతగారి ముత్యం గౌడ్ , దోమకొండ సంజీవులు ,తాటిపల్లి భాస్కర్ రెడ్డి ,తాటిపల్లి బాల్రెడ్డి ఆశబోయిన నర్సింలు ,తిరుపతిరెడ్డి ,డాక్టర్ రాజు  డిష్ రవి సీనియర్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.