calender_icon.png 15 November, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనసంద్రంలా సాగిన చైతన్యం.. డ్రగ్స్‌పై యుద్ధం ముగింపు ర్యాలీ

15-11-2025 12:20:19 AM

లక్ష్మిదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుండి ప్రకాశం స్టేడియం వరకు పోలీసుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 14,(విజయక్రాంతి):జన సంద్రంలా సాగిన చైతన్యం.. డ్రగ్స్ పై యుద్ధం ముగింపు ర్యాలీ విజయవంత మైంది.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదే శాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో అక్టోబర్ 15 వ తేదీ నుండి శుక్రవా రం వరకు నెల రోజుల పాటు చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం పేరుతో అనేక అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు. శుక్ర వారం కార్యక్రమాన్ని ముగిస్తూ కొత్తగూడెం పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు.

లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుండి ప్రకా శం స్టేడియం వరకు సాగిన ఈ ర్యాలీలో స్థానికులు, విద్యార్థులు, ప్రజాప్రతి నిదులు, పుర ప్రముఖులు బారీ సంఖ్యలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సుమారు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా నిర్వహించిన ‘చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం‘ అవగాహనా కా ర్యక్రమాల ముగింపు సభ జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో అట్టహాసంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా జిల్లా జడ్జి పాటిల్ వసంత్,జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్యలు పాల్గొన్నారు. ఈ నెల రో జుల ప్రచార కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం యువతను, విద్యార్థులను మాదక ద్రవ్యాల (డ్రగ్స్) కోరల నుండి రక్షించడం, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై సమగ్ర అవగాహన కల్పించడం జరిగింది.

జి ల్లాలోని అన్ని మండలాలు, గ్రామాలు ము ఖ్యంగా విద్యా సంస్థలు,కళాశాలల్లో పోలీసు అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహనా సదస్సులు, ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. విద్యార్థులు,యువత,తల్లిదండ్రులు, ఉపాధ్యాయు లు, ప్రజా ప్రతినిధులను ఈ అవగాహనా కార్యక్రమాల్లో భాగ స్వాములను చేశారు. పాల్గొన్న వారందరికీ ఆయా స్కూల్లు,కళాశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమా లను ఏర్పాటు చేసి అలరించారు.

చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం ముగింపు సభలోముందు గా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం అనేది వ్యక్తిగత సమస్య కాదని,ఇది సామాజిక రుగ్మత అని,దీనిపై పోలీసులతో పాటు ప్రతి పౌరుడు యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు.భవిష్యత్తులో కూడా ఈ చైతన్యం కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తె లిపారు.ముగింపు వేడుకలో చురుకుగా పా ల్గొన్న విద్యార్థులకు,స్వచ్ఛంద సంస్థలకు, జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.

జిల్లా ను డ్రగ్స్ రహిత భద్రాద్రి గా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని, డ్రగ్స్కు సంబంధించిన సమాచారాన్ని ధైర్యం గా తమకు తెలియజేయాలని పోలీసులు కో రారు.కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ యం త్రాంగం తరఫున డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను,అభివృద్ధికి డ్రగ్స్ లేని సమాజం యొక్క ఆవశ్యకతను వివరించా రు. నెల రోజుల పాటు ఎస్పీ సారధ్యలో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి న పోలీసు శాఖను చైతన్యం అవగాహనా కా ర్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న యువత ను,విద్యార్థులను అభినందించారు.

డ్రగ్స్ సమస్య కేవలం చట్టాన్ని అమలు చేసే సమ స్య కాదని,ఇది సామాజిక,ఆర్థిక అభివృద్ధికి పెద్ద అవరోధమని పేర్కొన్నారు. డ్రగ్స్ ని ర్మూలనలో పోలీసులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం (విద్య, వైద్యం, సంక్షేమం) చు రుగ్గా పాల్గొనాలని నొక్కి చెప్పారు. జిల్లాలోని విద్యా సంస్థలు ,హాస్టళ్లలో ప్రత్యేక ని ఘా ఉంచాలని, అనుమానాస్పద కార్యకలాపాల గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయు లు నిర్భయంగా అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

యువత డ్రగ్స్కు బానిసలు కాకుండా ఉండేందుకు క్రీడలు,కళ లు,సాంస్కృతిక కార్యక్రమాలు వంటి సానుకూల ప్రత్యామ్నాయాలను అలవాటు చేసు కుని డ్రగ్స్కు వ్యతిరేకంగా యువత సైనికులు గా పనిచేయాలని పిలుపునిచ్చారు.జి ల్లా జడ్జి పాటిల్ వసంత్ గారు మాట్లాడుతూ డ్ర గ్స్ నియంత్రణకు సంబంధించిన చట్టపరమైన అంశాలు,నేరస్తులకు విధించే శిక్షలు , న్యాయ వ్యవస్థ పాత్ర గురించి వివరించారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు సం బంధించిన చట్టం ఎంత కఠినంగా ఉంటుం దో వి వరించారు. డ్రగ్స్ తయారీ,సరఫరా, విక్ర యం మరియు వాడకం అనేది క్షమించరాని నేరం అని నొక్కి చెప్పారు.

ఈ చట్టం కింద నేరం రుజువైతే కఠిన కారాగార శిక్షలు,భారీ జరిమానాలు ఉంటాయని యువతకు సూ చించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం న్యా య వ్యవస్థ ఎల్లప్పుడూ పోలీసులకు,ప్రజల కు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి కృ ష్ణ గౌడ్,అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్,భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్,జిల్లా రవాణాధికారి వెంకటరమణ, సూపరింటెండెంట్ జానయ్య, మున్సిపల్ కమీషనర్ సుజాత,డిఎస్పీలు రెహమాన్, చంద్రభాను,రవీందర్ రెడ్డి,సతీష్ కుమార్, మల్లయ్య స్వామి, తదితరులు పాల్గొన్నారు.