calender_icon.png 15 November, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు

15-11-2025 12:20:22 AM

- కలెక్టర్ దీపక్ కుమార్ 

బెల్లంపల్లి, (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించి నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం బాలల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని కాసిపేట మండలం పెద్దనపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీరు, విద్యుత్ సౌకర్యాలతో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు బోధన అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.

ఉన్నత చదువులకు పాఠశాల విద్య పునాది వంటిదని విద్యార్థులకు ఏకాగ్రత, క్రమశిక్షణ అలవాటు చేయాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పిల్లల ప్రవర్తన ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. ఉపాధ్యాయులు సమన్వయంతో పిల్లల భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలని సూచించారు. పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి సహాయపడాలని, ఖాళీ సమయాల్లో విద్యార్థులకు చదువు పై అవగాహన పెంచాలని కోరారు. పూర్వ విద్యార్థి గుర్రం రాజేష్ గౌడ్ తన సొంత ఖర్చులతో పాఠశాలలో బోరు, ప్రహరీ, త్రాగునీటి సదుపాయిని కల్పించడం అభినందనీయమని చెప్పారు.