12 April, 2026 | 7:40 PM

మండుటెండలో మానవత్వానికి మద్దతు

12-04-2026 05:57 PM

పాదచారులకు చల్లని ఉపశమనం అందించే సేవలు

హనుమకొండ,(విజయక్రాంతి): న్యూ శాయంపేట జంక్షన్ లో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, 31 వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు యాదవ్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రతియేడు మాదిరిగానే ఈ వేసవిలో కూడా కిషన్‌పురలోని ఎమ్మెల్యే ఇంటి ముందు చలివేంద్రం ఏర్పాటు చేసి, ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించారు.ఈ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి  తండ్రి  నాయిని నరేందర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరులు నాయిని అమరేందర్ రెడ్డి, ప్రవీణ్, కృష్ణ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.