15-11-2025 12:20:06 AM
డిస్నీల్యాండ్‌లో ఉత్సాహంగా వేడుకలు
హైదరాబాద్, నవంబర్ 14(విజయక్రాం తి): బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం డిస్నీల్యాండ్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. సుమారు 850 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 40 మంది విద్యార్థినులు ఉపాధ్యాయినిలుగా, 80 మం ది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల యాజమాన్యం దయ్యాల మల్లయ్య, సదయ్య, బాలుగు లక్ష్మినివాసం,బాలుగు శోభారాణి,డి.రాకేష్ భాను, డి.దినేష్ చందర్ మాట్లాడుతూ విద్యార్థులే దేశానికి వెన్నెముక లాంటి వారని అన్నారు. రేపటి భావి భారత పౌరులని అందరూ సన్మార్గంలో నడిచి దేశ భవిష్యత్తుకు తోడ్పడాలని సూచించారు. విద్యార్థులను గైడ్ చేసిన టీచర్లను, టీచర్స్‌గా వ్యవహరించిన విద్యార్థులను అభినందించారు.