12 April, 2026 | 7:42 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వినియోగం చేసుకోవాలి

12-04-2026 05:59 PM

సర్పంచ్ బుక్క శ్రీనివాస్ గుప్తా

తుంగతుర్తి,(విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని బస్తాల సర్పంచ్ బుక్క.శ్రీనివాస్ గుప్తా అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారుల చేతుల్లో పోసి మోసపోవద్దని అన్నారు. రైతు పండించిన ప్రతి దాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు ధాన్యం విక్రయాలలో నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి నిర్వాహకులు కర్నాటి అనిత, రైతులు పాల్గొన్నారు.