17 June, 2026 | 11:09 AM

Breaking News

మంత్రులు అడ్లూరి, వివేక్ కు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •  

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్మృతి

03-07-2024 01:01 AM

హైదరాబాద్, జులై 2 (విజయక్రాంతి): భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. దక్షిణాఫ్రికాతో ముగిసిన ఏకైక టెస్టులో భారీ సెంచరీతో కదంతొక్కిన స్మృతి.. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొంది. ఈ  సందర్భంగా టీటీడీ ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగానాయకులు మండపంలో స్మృతికి పండితులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందచేశారు.