14 August, 2026 | 2:58 AM

రాష్ట్రాల హక్కులకు ఢోకా ఉండదు!

14-08-2026 01:22 AM
  1. తాజా బిల్లు మేజర్ మినరల్స్‌కే పరిమితం 
  2. ‘ఈ--ఆక్షన్’తో గనుల కేటాయింపుల్లో పారదర్శకత 
  3. బొగ్గు, గనుల ద్వారా మరింత ఆదాయం 
  4. కేంద్రం వాటాను తగ్గించి, రాష్ట్రాల రెవెన్యూ పెంచాం 
  5. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఆగష్టు 13 (విజయక్రాంతి) : పార్లమెంటులో తాజాగా ఆమో దం పొందిన బిల్లు మేజర్ మినరల్స్‌కు (ప్రధాన ఖనిజాలు) మాత్రమే సంబంధించినదని, రాష్ట్రాల పరిధిలోని మైనర్ మినరల్స్ విషయంలో ఎలాంటి మార్పు లు చేయలేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. దేశీయం గా బొగ్గు, ఖనిజాల ఉత్పత్తిని పెంచి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.

రాష్ట్రాల అధికారాలను కేంద్రం లాక్కుంటోందన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కోసం వినియో గించే మేజర్ మినరల్స్ ఒకే విధమైన ధర ఉండేలా చర్యలు తీసుకోవడమే బిల్లు ఉద్దేశమన్నారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ న మాట్లాడారు. బొగ్గు, గనుల రంగంలో 12 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు.

గనుల కేటాయింపుల్లో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ఈ--ఆక్షన్ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2015, 2020 సంవత్సరాల్లో పలు కీలక సంస్కరణలు చేపట్టామన్నారు. ఇప్పటివరకు 141 బొగ్గు గనుల వేలం ప్రక్రియ పూర్తికాగా.. 105 మినరల్ బ్లాకుల్లో ఉ త్పత్తి ప్రారంభమైందని తెలిపారు. బొగ్గు, గనుల రంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత ఆదాయం అందేలా కేంద్రం చర్యలు తీ సుకుందన్నారు.

2014కు ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు రెవెన్యూ షేర్ ద్వారా రూ.13,258 కోట్లు మాత్రమే వచ్చేవని, ప్రస్తుతం అది సుమారు రూ.71 వేల కోట్లకు పెరిగిందని  మంత్రి  స్పష్టం చేశారు. గ తంలో రాష్ట్రాలకు 65 శాతం రెవెన్యూ వాటా ఉం డగా.. సంస్కరణల కారణంగా ప్రస్తుతం 88 శాతానికి పెరిగిందని, అదే సమయంలో కేం ద్రం వాటా 35 శాతం నుంచి 12 శా తానికి తగ్గిందని వివరించారు. కేంద్రం తన వాటాను తగ్గించుకుని రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం కల్పిస్తుందని చెప్పారు.

ఆక్షన్ ప్రీమియం, రాయల్టీ వంద శాతం రాష్ట్రాలకే..

బొగ్గు రంగంలోనూ రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పెరిగిందని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 2014- రాష్ట్రాలకు సుమారు రూ.12 వేల కోట్ల రెవెన్యూ మాత్రమే రాగా.. ప్రస్తుతం రూ.58,592 కోట్లకు పెరిగిందన్నారు. రాష్ట్రాల వాటా గతంలో 55 శాతం ఉండగా.. ఇప్పుడు 90 నుంచి 96 శాతం వరకు పెరిగిందని వివరించారు. ఆక్షన్ ప్రీమి యం, రాయల్టీ మొత్తాలను కూడా వంద శాతం రాష్ట్రాలకే అందిస్తున్నామని, ఇందులో కేంద్రం ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.

మైనింగ్ కార్యకలాపాల వల్ల ప్రభావితమయ్యే ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా నిధులు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ నిధులను మౌలిక వసతులు, విద్య, వైద్యం తదితర రంగాల్లో వినియోగిస్తున్నామని తెలిపారు. దేశంలో 72 శాతం బొగ్గు ఆధారంగానే విద్యుత్ ఉత్పత్తి అవుతుందని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు తక్కువ ధరకే బొగ్గు అందిస్తున్నామని, 2018 తర్వాత కోల్ ఇండియా బొగ్గు ధరలను ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నారు.

ఇళ్ల నిర్మాణం, మౌలిక వ సతుల కల్పనకు అవసరమైన సిమెంట్, స్టీల్, అ ల్యూమినియం ఉత్పత్తిలో కీలకమైన మేజర్ మినరల్స్ ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీ సుకుంటున్నామని తెలిపారు. కోల్ గ్యాసిఫికేషన్‌కు కేంద్రం రూ.46 వేల కోట్లు ఖర్చు చేస్తుందని చె ప్పారు. రాష్ట్రాలు బాగుంటేనే కేంద్రం బలపడుతుందనే సూత్రంతో సహకార సమాఖ్య విధానం లో ముందుకు సాగుతున్నామన్నారు.

దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితిని తగ్గించేందుకు కేంద్రం రూ.34 వేల కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ప్రారంభించిందని మంత్రి తెలి పారు. ఇప్పటికే 20 దేశాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని, క్రిటికల్ మినరల్స్ రంగంలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్రాల ఆర్థిక బలోపేతం, దేశీయ ఖనిజ ఉత్పత్తి పెంపు, ఉపాధి అవకాశాల కల్పన, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా బొగ్గు, గనుల రంగంలో సంస్కరణలను కొనసాగిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.