సర్వాంగీణ సాహితీమూర్తి
మసన చెన్నప్ప :
ఆకాశవాణి శ్రోతలకు, ముఖ్యంగా సాహితీ లోకానికి ‘సుధామ’గా పరిచయమైన నా మిత్రుని అసలు పేరు అల్లంరాజు వెంకటరావు. నాకంటే నాలుగేండ్లు పెద్ద. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో వారు నాకు సీనియర్.
మేం ఇద్దరం ఆచార్య కె.కె.రంగనాథాచార్యులకు ప్రియమైన శిష్యులం. ప్రాచ్య కళాశాలలో జరిగే అన్ని కార్యక్రమాల్లో కలి సి పాలుపంచుకునే వాళ్లం. నేను డిప్.ఓ.ఎ ల్‌లో ఉండగానే చెయ్యి పట్టుకొని హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రానికి తీసుకొని వెళ్లి యువ వాణి కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేసిన ప్రియమైన మిత్రుడు సుధామ!
ఇద్దరం ప్రాచ్య కళాశాలలో సహాధ్యాయులం కాకపోయినా, ఉస్మానియా విశ్వ విద్యాలయంలో సహ పరిశోధకులం. ఆకాశవాణి వారి కోరిక మేరకు సుధామ హైద రాబాద్ కేంద్రంలో ఉద్యోగంలో చేరి, 1991లో కార్యక్రమ నిర్వాహణాధికారిగా పదోన్నతి పొందారు. కొంతకాలం విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పనిచేసి ఆ తర్వాత హైదరాబాద్‌లో 1995 నుంచి తెలుగు విభాగం అధిపతిగా ఉండి, 2008లో స్వచ్ఛంద ప దవీ విరమణ చేశారు.
సుధామ పరిషత్ కళాశాలలో ఎం.ఓ.ఎ ల్ చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాలాగే ఎం.ఏ. చదివి ‘తెలుగు అభ్యుద య కవిత్వంలో భావచిత్రణ’ అనే అంశం మీద ఎం.ఫిల్ పరిశోధన చేశారు. కరీంనగర్‌లో కొద్ది కాలం లెక్చరర్‌గా ఉన్నప్పటికీ, వారికి బాల్యం నుంచి ఆకాశవాణితో ఉన్న అనుబంధం వల్ల తర్వాతి కాలంలో ఉపన్యాసకులుగా కొనసాగలేదు.
సుధామ బాల్యం కేవలం ఆటపాటలతో కాక, తెలుగు భాషా సాహిత్యాలతో చెట్టాపట్టాలు వేసుకొని ముందుకుసాగిం ది. పదేళ్ల వయస్సులోనే ‘విజయజ్యోతి’ అనే లిఖిత మాస పత్రికకు సంపాదకుడయ్యారు. ‘అమర్ జవహర్ బాలానందం సంఘం’ స్థాపించి తోటి బాలల మనోవికాసానికి తోడ్పడ్డారు. 1967లో తన పద హారవ ఏట ‘యువమిత్ర సచిత్ర లిఖిత మాసపత్రిక’కు సంపాదకులై 8 సంవత్సరాలు పనిచేశారు.
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినారె ‘నేటి ముద్రిత పత్రికలు ముఖం చూసుకోదగ్గ అద్దం ఈ లిఖిత పత్రిక’ అని ప్రశంసిం చడం గమనార్హం. సుధామ దాదాపు అన్ని తెలుగు పత్రికలకు తెలిసిన రచయిత. ఒక రచయితగానే కాక, కవిగా, కార్టూనిస్ట్‌గా, చిత్రకారునిగా, పజిల్స్ నిర్మాతగా, సాహితీవేత్తగా ప్రసిద్ధి పొందారు. సుమారు నూ రు గ్రంథాలకు ముఖచిత్రాలు వేశారు. ప్రతిష్ఠాత్మకమైన ‘యువభారతి’ సాహిత్య సంస్థలో క్రియాశీల కార్యకర్తగా పనిచేసి, యువ భారతి ప్రచురణలకు సంపాదకులయ్యారు.
2021లో ‘ఓసారి చూడండి. అంతే’ పేరుతో ఒక కొత్త వాట్సాప్ గ్రూప్ ప్రవేశపెట్టి ప్రసార సంచికగా విజ్ఞాన, వినోద, వికాసాలకు దోహదం చేశారు. మూడు వేల మంది సభ్యులతో అలరారిన గ్రూప్ అది. వాట్సాప్ ద్వారా 2022లో కథల పో టీ నిర్వహించారు. ‘ప్రసన్న భారతి ప్రసార సంచిక’ పేర 2023లో ఉగాది కథల పోటీ నిర్వహించి, బహుమతులిచ్చి సామాజిక మాధ్యమంలో ఒక వినూత్న ప్రయోగానికి నాంది పలికారు.
ఒకే రోజు 98 మంది సప్తపది ప్రక్రియను చేబట్టి 600 సప్తపదులు రాయడం తెలుగు కవిత్వ చరిత్రలో రికార్డు. వారిలో కొందరు తాము రాసిన సప్తపదులను 12 సంపుటాలుగా తీసుకురావడం విశేషం. 60 గ్రంథాలకు పైగా రచించిన విహారి ‘నూటపదహార్లు సప్తపదులు’ రాసి తొలి సంపుటిని సుధామకే అంకితం చేశారు.
1967లో ‘వీచికలు’ పేరుతో నలుగురు కవులు కలిసి ప్రచురించిన కవిత సంకలనంలో సుధామ ఒకరు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన కవితాసంపుటి ‘కావ్యమాల’లో సుధామకు చోటు లభించిం ది. 1974లో వెలువడిన ‘మేం’ కవితా సం కలనంలో సుధామ, నాగినేని భాస్కరరా వు ఇద్దరూ జంటకవులు.
సుధామ తొలి కవితా సంపుటి ‘అగ్ని సుధ’ 1990లో ప్రచురితమైంది. ‘మనసు పావన గంగ’ పేరుతో రేడియో, టీవీ పాటలను సుధామ 2010లో పుస్తకంగా తెచ్చా రు. ప్రసిద్ధమైన అన్ని పత్రికల్లో సుధామ కార్టూన్లో, పుస్తక సమీక్షలో ప్రచురితమవడం విశేషం. ‘విజయక్రాంతి’ దినపత్రి కలో ‘వసుధామయం’ పేరిట వచ్చిన వ్యా సాలు ‘కాలం వ్యాసాలు’గా 2019లో ప్ర చురితమయ్యాయి. తెలుగు సొగసులు యువ భారతి ప్రచురణ. ‘కాలం వెంటకలం’, ‘సందర్భం’, ‘తెమ్మెర’, ‘జీవన సం ధ్య’, ‘మన పండుగలు’, ‘ఈసఫ్ నీతి కథ లు’, ‘పురాణబాలలు’ మొదలైన సుధా మ రచనలు పాఠక లోకాన్ని అలరించాయి.
సుధామ రచించిన తొలి కథ 1965లో ‘బాల బంధు’ పత్రికలో ప్రచురితమైంది. తొలి కవిత 1968లో ‘నవ్యవాణి’లో ప్రచురితమైంది. ‘శంకర్స్ వీక్లీ’ వంటి ఆంగ్ల పత్రి కలతో సహా వివిధ పత్రికల్లో సుధామ వేసిన కార్టూన్లు వెయ్యి దాకా ప్రచురితమయ్యాయి.
తెలుగునాట అన్ని పత్రికలు సుధామ రచనలను ప్రచురించాయి. సు ధామ ఒక వ్యాసం రాసినా, కవిత రాసినా, ఒక కార్టూ న్ వేసినా అందులో ఒక సందే శం ఉం టుంది. హాస్యాన్ని మిళితం చేయడం వీరి ప్రత్యేకత. పాఠకులను తనవైపు తిప్పుకొనే నైపుణ్యం సుధామలో పుష్కలంగా ఉందనడానికి అతణ్ని ఆదరించిన పత్రికలూ, పాఠకులే మంచి ఉదాహరణ.
సుధామ సాహిత్య కృషికి అలంకారం గా ఎన్నో అవార్డులు లభించాయి. వాటి లో ‘అగ్ని సుధ’కు అభించిన ఉమ్మడిశెట్టి సాహితీ పురస్కారం, ఆచార్య తిరుమల స్మారక సాహితీ పురస్కారం, తురగా కృష్ణమోహన్‌రావు స్మారక పురస్కారం, కమ లాకర ఛారిటబుల్ ట్రస్టు వారి ఉగాది పురస్కారం, మునిమాణిక్యం హాస్యనిధి పు రస్కారం, దివాకర్ల వేంకటావధాని స్మారక ట్రస్టు సాహిత్య పురస్కారంతోపాటు, యు వ కళాతాహిని, గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్, తెలంగాణ సారస్వత పరిషత్తు, యువ భారతి పక్షాన లభించిన పురస్కారాలు ముఖ్యమైనవి. 2026లో పద్మభూషణ్ వ రప్రసాదరెడ్డి శాంత వసంత ట్రస్టు పక్షాన ‘కోడూరు వెంకటరమణారెడ్డి సా హితీ సేవారత్న పురస్కారం’ లక్ష రూపా య నగదుతోపాటు అందించడం సుధామ సాహితీ వ్యక్తిత్వానికి ఒక మంచి గుర్తింపు.
సుధామ హైదరాబాద్, తిరుపతి, బెంగళూరులలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు. సింగపూర్, దుబాయి మొదలైన దేశాలు పర్యటించారు. 2016లో అమెరికా వెళ్లి వచ్చారు. నా అదృష్టం ఏమంటే హైదరాబాద్‌లో జరిగిన తానా, ఆటా కవి సమ్మేళనాల్లో నేను సుధామతో కలిసి పాల్గొన్నాను. నా దృష్టిలో సుధామ అంటే ఒక సర్వాంగీణ సాహితీమూర్తి.
వ్యాసకర్త సెల్: 9885654381






