30 July, 2026 | 8:44 PM

Breaking News

సింగరేణికి కొత్త బాస్?

14-12-2025 01:27 AM
  1. సీఎం పరిశీలనలో నవీన్ మిట్టల్!
  2. రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన?

గోదావరిఖని, డిసెంబర్ 13 (విజయక్రాంతి): తెలంగాణ కొంగు బంగారం, అతి పెద్ద పరిశ్రమ సింగరేణి సంస్థకు కొత్త బాస్ రాబోతున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలనలో నవీన్ మిట్టల్ పేరు ఉన్నట్లు తెలిసింది. రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సింగరేణి సంస్థ సీ అండ్ ఎండిగా (ఐఆర్ ఎస్) అధికారి అండ్ బలరాం నాయక్ వ్యవహరిస్తు న్నారు.

2024 జనవరి 2న ఆయన సింగరేణి సీఎండీగా పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం సింగరేణి సంస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. బొగ్గు ఉత్పత్తి రంగంలోనే కాకుండా ఇతర వ్యాపార రంగాలలో కూడా సింగరేణి సంస్థ అడుగు పెట్టేం దుకు విప్లవాత్మక సంస్కరణలకు రూపకల్పన చేశారు.

ఈ నేపథ్యంలో సంస్థ కొత్త సీఎండీగా నవీన్ మిట్టల్‌ను నియమిస్తారని శనివారం సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. ఈ విషయంలో సింగరేణి సంస్థ అధికార వర్గాలు సైతం చెప్పకనే చెపుతుండటంతో  మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుకు కారణం ఏమై ఉంటుందని సంస్థవ్యాప్తంగా అధికా ర వర్గాల్లో  జోరుగా చర్చ జరుగుతుంది.