నూతన హెల్త్ స్కీం రూపొందించాలి
09-05-2024 12:16 AM
పీఆర్సీ కమిటీకి పీఆర్టీయూ విజ్ఞప్తి
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): గత పీఆర్సీ ప్రతిపాదనల మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు నూతన హెల్త్ స్కీంను రూపొందిం చి, దాన్ని అమలుపరచాలని పీఆర్టీయూ టీఎస్ నేతలు పింగలి శ్రీపా ల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు బుధవారం తెలిపారు. ఎయిడెడ్, మోడల్ స్కూళ్లతో పాటు అన్ని సొసైటీల పరిధిలోని గురుకుల విద్యాలయాల్లో పనిచేసే అధ్యాపకులకు హెల్త్ కార్డులు అమలు చేయాలని, తమ ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. రూ. 398 వేతనంతో పనిచేసిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసేలా పీఆర్సీ కమిటీకి ప్రతిపాదనలు అందజేసినట్లు తెలిపారు.




