11 April, 2026 | 1:45 PM

ఎప్‌సెట్‌కు 91.67% హాజరు

09-05-2024 12:13 AM

నేటి నుంచి ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): టీఎస్ ఎప్‌సెట్ పరీక్షకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 91.67 శాతం మంది హాజరైనట్లు ఎప్‌సెట్ కన్వీనర్ బి.డీన్ కుమార్ తెలిపారు. బుధవారం జరిగిన అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షకు మొత్తం 33,427 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 30,641 మం ది పరీక్షకు హాజరైనట్లు చెప్పా రు. తెలంగాణ నుంచి 92.69 శాతం, ఏపీ నుంచి 81.81 శాతం మంది హాజరు కాగా మొత్తంగా 91.67 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ఆయన వెల్లడించారు. 

నేటి నుంచి ఇంజనీరింగ్..

బుధవారంతో ఎప్‌సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి పరీక్షలు ముగిశాయి.  గురువారం నుంచి ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు జరగ నున్నాయి. ఈనెల 11 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీ నుంచి ఇంజనీరింగ్ విభాగానికి సుమారు 2.60 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.