11 April, 2026 | 4:39 PM

నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్

11-04-2026 03:01 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో మంచి పాలన అవసరం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ శనివారం కార్యకర్తల సమావేశం నిర్వహించింది. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లను కేటీఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...  నాకు నమ్మకం ఉంది.. వచ్చేంది మా ప్రభుత్వమేనన్నారు.

రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఢిల్లీకి సీఎం ఎన్నిసార్లు వెళ్తారో.. ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు అన్ని ఇన్ని కావని సూచించారు. ఇబ్రహీంపట్నంను అభివృద్ధి చేస్తామని మంత్రులందరూ అన్నారు. ఇబ్రహీంపట్నంలో గెలిచింది గులాబీ జెండా కాదు.. ప్రజాస్వామ్యమన్న కేటీఆర్ దాన్ని నిలిపింది మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి లాంటి అరాచక శక్తులతో పోరాడి నిలబడటం చిన్న విషయం కాదని కేటీఆర్ సూచించారు.