11 April, 2026 | 4:50 PM

జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి

11-04-2026 03:12 PM

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్

దేవరకొండ,(విజయక్రాంతి): జ్యోతిరావు పూలే  జయంతి  ఆశయ సాధన కోసం కృషి చేయాలని  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేవరకొండ పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించినారు. ఈ సందర్భంగా సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశానికి ఒక ఆదర్శప్రాయుడని సామాజిక తత్వవేత్త, సాంఘిక సంఘ సంస్కర్త, సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపాలని

అంటరానితనం కోసం మానవులందరూ సమానమే అని అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేసినారు సతీ సాగమనం వితంతు పునర్వివాహం వంటి కార్యక్రమాలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి అని కొనియాడారు. ఆదర్శంగా తీసుకొని సర్వసభ్య సమాజం కోసం బహుజనులందరూ కృషి చేయాలని బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కోటేశ్వరరావు, పున్న  వెంకటేష్ నేత, ఆర్.బి రాథోడ్, పున్న బిక్షమయ్య, నరసింహ ,శివ, నటువ సుధాకర్ ,పాండురంగ చారి, వనం చంద్రకళ,లైబ్రేరియన్ శారద, యాదయ్య చారి తదితరులు పాల్గొన్నారు