11 April, 2026 | 4:33 PM

నిర్మల్‌లో నిరసన తెలుపుతున్న నాయకులు

11-04-2026 02:59 PM

నిర్మల్,(విజయక్రాంతి): సిపిఐ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంగారావు పై ఏన్ఐఏ పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆ పార్టీ నాయకులు నిర్మల్ లో నిరసన తెలిపారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట అరెస్టుకు నిరసనగా నినాదాలు చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం ఆయన అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్యని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజన్న బక్కన్న రామ్ లక్ష్మణ్ గంగన్న మహేందర్ లక్ష్మి గోదావరి తదితరులున్నారు