11 April, 2026 | 5:22 PM

Breaking News

గ్రూప్1 పోస్టులకు సమాన వేతనం

09-05-2024 12:19 AM

పీఆర్సీ కమిషన్‌కి గ్రూప్1 అధికారుల సంఘం విజ్ఞప్తి

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): గ్రూప్ నోటిఫికేషన్ ద్వారా నియమించబడిన గ్రూప్ పోస్టుల వేతనాలలో మూడు రకాల వ్యత్యాసాలు ఉన్నాయని, వాటిని సవరిస్తూ గ్రూప్ పోస్టులన్నింటికీ సమాన వేతనాలు ఉండేలా చూడాలని పీఆర్సీ కమిటీకి గ్రూప్ అధి కారుల సంఘం నేతలు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, హన్మంతు నాయక్  విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలను పీఆర్సీ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. గ్రూప్ అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని, స్టేట్ సివిల్ సర్వీసెస్‌గా గ్రూప్ సర్వీస్ పోస్టులను పరిగణించాలని కోరారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా గ్రూప్ అధికారులను నియమించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు వేణు మాధవరెడ్డి, హరికిషన్, రమేష తదితరులు పాల్గొన్నారు.