21 May, 2026 | 3:16 PM

Breaking News

తెల్ల తెల్లవారుతుండగానే పల్లెల్లోకి పాఠశాలల ప్రచారం.. విత్తన కంపెనీల ప్రచార రతాలు   •   ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరం   •   ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి..   •   ఆరోగ్యం బాగుంటేనే జీవితం సార్థకం   •   ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్   •   అనుమతి లేని ప్రైవేట్, విద్యాసంస్థలను మూసివేయాలి   •   కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెన్త్ టాపర్ కు సైకిల్ బహుకరణ...   •   జైనూర్‌లో చలివేంద్రం – అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   బాన్సువాడలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు...   •   ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు   •  

టాలీవుడ్‌కు కొత్త హీరో

06-02-2025 12:12 AM

టాలీవుడ్‌కు మరో కొత్త హీరో పరిచయం కాబోతున్నాడు. ఆయనే మారిశెట్టి అఖిల్. ఈ యువ కథానాయకుడు ఎవరో కాదు.. ఏపీకి చెందిన రాజకీయ నాయకుడు మారిశెట్టి శ్రీకాంత్ తనయుడే. శ్రీధన్ దర్శకత్వంలో ఏకే టెక్ మార్కెటింగ్ మూవీ క్రియేషన్స్ పతాకంపై మారిశెట్టి శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంలో భానుశ్రీ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా చిత్రీకరణ తాజాగా అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని నిర్మాత సొంత గ్రామమైన లక్ష్మీపురంలో ఉన్న రామాలయంలో ప్రారంభమైంది. సీనియర్ నిర్మాత నట్టికుమార్, చిత్ర కథానాయకుడు మారిశెట్టి అఖిల్, దర్శకుడు శ్రీధన్, నిర్మాత మారిట్టి శ్రీకాంత్, స్థానికులు పాల్గొన్నారు.