ఆలేరులో కొత్త మాఫియా
- అధికారుల లెక్కలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదు
- సంక్షేమ పథకాలు నిజంగా అమలవుతున్నాయా?
- ఆలేరు ప్రజాపాలన సంబురాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): ఆలేరులో శనివారం జరిగిన ప్రజాపాలన (ప్రగతి ప్రణాళిక) సంబురాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. అధికారుల పనితీరు, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యలపై సంచలన వ్యా ఖ్యలు చేశారు. వేదికపై ఉన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఇతర అధికారుల సమక్షంలో కీలక అంశాలపై మాట్లాడారు.
అధికారుల లెక్కలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని, అధికారులు వేదికపై చెబుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు నిజంగా గ్రామాల్లో అమలవుతున్నాయా లేదా అని మల్లన్న ప్రశ్నించారు. నియోజకవర్గంలో 3564 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైతే, కేవలం 842 మాత్రమే పూర్తయ్యాయని, ఇంకా 141 ఇళ్ల నిర్మాణం అసలు ప్రారంభమే కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 14,450 కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డులు ఇచ్చారని, ఇంకా 1853 మందికి ఇవ్వలేదని తెలిపారు.
నియోజకవర్గంలో 28,644 మంది మహిళలకు ఇంకా ఇందిరమ్మ చీరల పంపిణీ జరగలేదని వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో ఇంకా 36,913 క్వింటాళ్ల వరిధాన్యం నిల్వలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. 2014 మహిళా సంఘాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, స్త్రీ నిధి రుణాల పంపిణీ తుర్కపల్లి మండలంలో కేవలం 29.74% మాత్రమే జరిగిందని గణాంకాలతో సహా వివరించారు. సంక్షేమం అంటే ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన పన్నులను తిరిగి అవసరమైన ప్రజలకు చెల్లించడమే అని స్పష్టం చేశారు.
ఆలేరు నియోజకవర్గంలో కొంతమంది కొత్త మాఫియాగా తయారై ప్రజల ను ఇబ్బంది పెడుతున్నారని సంచలన వ్యా ఖ్యలు చేశారు. భూముల కబ్జాపై నిగ్గు తేల్చాలని దీనిపై జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన పేదలందరికీ కుల, మత, పార్టీలకతీ తంగా పథకాలు అందాలని ప్రజాప్రతినిధులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్య పెరగాలని, మహిళా సం ఘాల పర్యవేక్షణ సరిగ్గా జరగాలని సూచించారు.
బీసీలకు న్యాయం జరగాలని, వారికి రిజర్వేషన్లు రావాలని కోరారు. చట్టసభల్లో మహి ళలకు 33% రిజర్వేషన్లు దక్కాలని ఆయన ఆకాంక్షించారు. ఏ ఒక్కరు కూడా పథకం అందలేదని బాధపడకూడదని, 100 శాతం సంక్షేమ పథకాలు అమలు చేసిన ఆదర్శ నియోజకవర్గంగా ఆలేరు గొప్ప పేరు తెచ్చుకోవాలని తీన్మార్ మల్లన్న ఆకాంక్షించారు.






