21 July, 2026 | 11:32 AM

సుమంత్ ప్రభాస్.. సాయిలు కంపాటి కాంబోలో కొత్త సినిమా

21-07-2026 01:13 AM

ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో అగ్ర సంస్థగా కొనసాగుతున్న శ్రీవెంకటేశ్వర సినిమాస్ తమ తొలి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. పూస్కూర్ రామ్‌మోహన్ రావు, భరత్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ సాయిలు కంపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ కథానాయకుడు.

ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో అడివి శేష్, సదానంద్ అతిథులుగా హాజరయ్యారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చిన్న పట్టణం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రేమకథతోపాటు కుటుంబ భావోద్వేగాలు, వినోదానికి మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో సుమంత్ ప్రభాస్ తన ఎనర్జీకి తగ్గ పూర్తిస్థాయి వినోదం పంచే క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.