19 August, 2026 | 4:55 PM

‘డొంగ్లీ’కి కొత్తగా ప్రజా పరిషత్

29-11-2024 12:28 AM

కామారెడ్డి, నవంబర్ 28 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాల్లో మండల ప్రజా పరిషత్ కార్యాలయాల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మద్నూర్ ఉమ్మడి మండ లం నుంచి వీడిపోయి, మండలంగా ఏర్పడిన డొంగ్లికి కూడా ప్రజాపరిషత్‌కు అనుమతులు వచ్చాయి.

ఇదే నియోజకవర్గంలో మరో మండలంగా ఏర్పడిన మహమ్మద్‌న గర్‌లోనూ ప్రజాపరిషత్ అందుబాటులోకి రానున్నది. దీంతో నియోజ కవర్గంలో మొత్తం ఎనిమిది మండలాలకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నిక ల్లో ఎనిమిది ఎంపీపీలు, ఎనిమిది జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.