జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు
మార్చిలో తొలిసారి రూ. 2 లక్షల కోట్లు దాటిన ఆదాయం
ఇది గతేడాదిలోని రూ.1,83,845 కోట్లతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: దేశంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. భారీగా పన్ను వసూళ్లు జరగడంతో మార్చిలో తొలిసారిగా రూ.2,00,0 64 కోట్లకి చేరుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం మార్చిలో స్థూల జీఎస్టీ వసూ ళ్లు రూ.2,00,064 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో వసూలైన రూ. 1,83,845 కోట్లతో పోలిస్తే ఇది 8.8 శాతం అధికం. దేశీయంగా స్థిరమైన ఆదాయంతో పాటు దిగుమతులపై పన్ను వసూళ్లు గణనీయంగా పెరగడమే ఇందుకు ప్రధాన కార ణంగా నిలిచింది.
దిగుమతులపై పన్నుల రాబడి ఏకంగా 17.8 శాతం పెరగగా, దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయం 5.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక రీఫండ్లను సర్దుబాటు చేసిన తర్వాత, నికర జీఎస్టీ వసూళ్లు మార్చిలో రూ. 1,77,990 కోట్లుగా నమోదయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 8.2 శాతం ఎక్కువ.మొత్తం 2025- ఆర్థిక సంవత్సరంలోనూ జీఎస్టీ వసూళ్లు సానుకూల వృద్ధినికనబరిచాయి.
ఈ ఏడాది స్థూ ల వసూళ్లు 8.3 శాతం వృద్ధితో రూ. 22.27 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2024 ఇవి రూ. 20.55 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.భారత ఆర్థిక వ్యవస్థ సుమారు 7 శాతం జీడీపీ వృద్ధితో ముందుకు సాగుతున్న తరుణంలో జీఎస్టీ వసూళ్లు అదేస్థాయిలో పెరగడం శుభపరిణామమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.




