2 April, 2026 | 2:19 AM

రష్యాలో కూలిన సైనిక విమానం

02-04-2026 12:30 AM

29 మంది మృతి

సాంకేతిక లోపమా? దాడి?

దర్యాప్తు చేస్తున్న రక్షణ శాఖ

మాస్కో, ఏప్రిల్1: రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకొని 29 మంది మృతిచెందారు. సైనిక విమానం ఏఎన్ క్రిమియా మీదుగా వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విమానానికి గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో 23మంది ప్రయాణికులు సహా ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

సాంకేతిక సమస్య వల్లే ఈ ప్రమాదం జరిగిందని రష్యా రక్షణశాఖ ప్రకటించింది. విమానంపై దాడి జరిగినట్లుగా వస్తున్న ఆరోపణల కొట్టిపడేసింది. అయితే దీనిపై దర్యాప్తు చేస్తోంది. క్రిమియాను రష్యా 2014లో స్వాధీనం చేసుకుంది. ఇదే ప్రాం తం మీద ప్రమాదం జరగడం గమనా ర్హం. ఏఎన్ సోవియట్ కాలంనాటి విమా నం. దీనిని ప్రధానంగా సైనిక అవసరాల కోసం, మధ్యస్థ దూరాలకు బరువైన సరుకులను, తక్కువ సంఖ్యలో ప్రయాణికులను రవాణా చేసేందుకు ఉపయోగిస్తారు.