2 September, 2026 | 2:57 AM

స్వదేశీకే ప్రాధాన్యమివ్వండి

02-09-2026 | 01:17am
  1. విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలి
  2. అనవసర బంగారం కొనొద్దు
  3. ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
  4. భారత్ 7.8% వృద్ధిపై హర్షం  

ఢిల్లీ, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): అంతర్జాతీయంగా యుద్ధాలు, సంక్షోభాలు, సరఫ రా గొలుసుల్లో అంతరాయాలు కొనసాగుతున్నప్ప టికీ భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతంవృద్ధిని నమోదు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) నమోదైన ఈ వృద్ధి ప్రజల సంకల్పం, కష్టానికి నిదర్శనమని పేర్కొన్నా రు. రిజర్వ్ బ్యాం క్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన 7 శాతం కంటే అధికంగా వృద్ధి నమోదవడం దేశ ఆర్థిక బలానికి సంకేతమన్నా రు.

అదే సమయం లో ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రజలు తమ వినియోగ అలవాట్లలో మార్పులు తీసుకురావాలని సూచించారు. స్థానికంగా తయారైన వస్తువులు, సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అనవసర విదేశీ ప్రయాణాలను తగ్గించుకోవాలని, అవసరం లేనప్పుడు బంగారం కొనుగోలు చేయొద్దని పిలుపునిచ్చారు. కిర్గిజ్‌స్థాన్ పర్యటనలో ఉన్న మోదీ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియో సందేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని మోదీ పేర్కొన్నారు. ఎ టుచూసినా యుద్ధాలు, సంక్షోభాల వార్తలే కనిపిస్తున్నాయని, సరఫరా గొలుసులుదెబ్బతిన్నాయన్నారుకోవిడ్ తర్వాత నుంచి ప్రపం చవ్యాప్తంగా స్థిరత్వం లోపించినప్పటికీ భార త్ మాత్రం పురోగతి సాధిస్తోందని తెలిపా రు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 7.8 శాతం వృద్ధి సాధించడం అసాధారణ విజయమని అభివర్ణించారు. ఈ ఘనతను దేశ ప్రజలు వేడుకగా జరుపుకోవడంతోపాటు.. మరింత అభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలని కోరారు.

విదేశీ పర్యటనలు.. డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు దూరంగా..

దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిచ్చే లా ప్రజలు తమ ఖర్చు నిర్ణయాలను మా ర్చుకోవాలని ప్రధాని సూచించారు. అవసరం లేని విదేశీ పర్యటనలను తగ్గించుకోవా లని, ముఖ్యంగా వివాహాల కోసం విదేశాలకు వెళ్లడం కంటే భారత్‌లోనే వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు. ‘భారత్‌లోనే వివాహం చేసుకోండి’ అనే ఆలోచనను ప్రోత్సహించాలని అన్నారు. దేశంలోనే ఖ ర్చు చేయడం ద్వారా స్థానిక వ్యాపారాలు, సేవారంగానికి మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు.

అనవసరంగా బంగారం కొనుగోలు చేయకుండా ఉండాలని  మోదీ ప్రజలకు వి జ్ఞప్తి చేశారు. భారత్ స్వావలంబనకు ప్రాధాన్యమిస్తే భవిష్యత్తులో మరింత వేగంగా అభివృద్ధి సాధించగలమని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.