28 June, 2026 | 3:35 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

మురుగునీటి దుర్గంధానికి శాశ్వత పరిష్కారం

11-03-2026 12:42 AM

* మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహాగౌడ్ 

అమీన్ పూర్, మార్చి 10: బీరంగూడ డి విజన్ పరిధిలోని జయలక్ష్మి నగర్, లక్ష్మి సా యి మెడోస్ కాలనీ మీదుగా వెళ్తున్న ప్రధాన మురుగు నీటి కాలువ మూలంగా వెలబడుతున్న దుర్వాసన సమస్యకు శాశ్వత పరి ష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అమీన్ పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నం దారం నరసింహ గౌడ్ తెలిపారు. ఇటీవల రెండు కాలనీల ప్రజలు నందారం నరసిం హా గౌడ్ ని కలిసి కాలువను శుభ్రపరచకపోవడంతో ప్రతిరోజు భరించలేని దుర్వాసన తో పాటు దోమల సమస్యను ఎదుర్కొంటున్నామని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన నందారం నరసింహా గౌడ్ అమీన్ పూర్ మున్సిపాలిటీ డీఈ వెంకటరమణకు సమస్యను వివరించారు. మంగళ వారం సంబంధిత అధికారులతో కలిసి స్వ యంగా రెండు కాలనీలలో నరసింహ గౌడ్ పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న స మస్యను అధికారులకు స్వయంగా చూపించారు. కాలువలను వెంటనే శుభ్రపరిచేలా చర్యలు చేపట్టాలని అధికారులకు విన్నవించారు. అతి త్వరలో సమస్యను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.