11 March, 2026 | 2:27 AM

అనుమతిలేని పశు వధశాల?

11-03-2026 12:41 AM

చనిపోయిన పశువుల మాసం కూడా విక్రయం ?

స్థానిక అధికారులతో కుమ్మక్కు

జీరో దందాగా మాంసం విక్రయం

జహీరాబాద్, మార్చి 10 : జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలంలో అక్రమ పశు వధశాల కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. న్యాల్కల్ మండలం మల్కి గ్రామ శివారులో వెలసిన ఈ పశువధశాలలో బర్రెలు, ఆవులు, ఎద్దులను వధించి వాటి మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

దీంతో పరిసర ప్రాంతమంతా దుర్గంధం వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ పశు వధశాల కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉండటం వల్ల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పశు వధశాల నుండి మాంసాన్ని హైదరాబాద్, బీదర్, జహీరాబాద్ తదితర ప్రాం తాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకుంటున్నారు.

ఈ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా ఏవైనా పశువులు చనిపోతే వాటిని తీసుకువచ్చి వాటి మాం సాన్ని కూడా ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పశువుల తో పాటు కుక్కలను కూడా తీసుకువచ్చి వాటి మాంసాన్ని కూడా మేక మాంసంలో కలిపి హైదరాబాద్ తో పాటు వివిధ పట్టణాలకు ఎగుమతి చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. కర్ణాటక సరిహద్దు, న్యాల్కల్ మండల శివారులో ఈ పశువధశాల ఉండటం వల్ల ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరైనా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వెళ్లి వాటి గురించి అడగగా వారిని బెదిరింపులకు గురి చేస్తూ గుండాయిజం చేస్తున్నట్లు పరిసర ప్రాంతాల ప్రజలు వాపోయారు.

ఈ పశు వధశాల గురించి అధికారులకు గ్రామ ప్రజలు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఈ ప్రాంతానికి పోలీసులు కూడా వెళ్లడం లేదని, అటు వైపు కన్నెత్తి కూడా చూడరని ఆయా గ్రామా ల ప్రజలు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ పశు వధశాల నుండి ప్రతిరోజు టన్నులకొద్దీ మాంసాన్ని వివిధ ప్రాంతాలకు ఎగు మతి చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి ఎలాంటి టాక్స్ కూడా చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు కూడా గండి పడుతుంది. జిల్లా కలెక్టర్, అధికారులు స్పందించి మళ్లీ గ్రామంలో ఉన్న ఈ పశు వధశాలను తొలగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.