calender_icon.png 10 October, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

09-10-2025 08:18:28 PM

చిలుకూరు: చిలుకూరు మండల పరిధిలో కోదాడ-హుజూర్నగర్ జాతీయ రహదారిపై కవితా కాలేజీ వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన సంఘటన గురువారం రాత్రి 7 గంటల సమయంలో చోటుచేసుకుంది. స్థానికులు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు ఢీకొన్న సంఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని, మృతుడు బేతవోలు గ్రామానికి చెందిన మదర్ సాహెబ్(30)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.