calender_icon.png 10 October, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించాలి

09-10-2025 08:22:32 PM

సూర్యాపేట ఆర్డిఓ వేణు మాధవరావు..

పెన్ పహాడ్: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్ రావు అన్నారు. గురువారం మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ స్వీకరణకు సంబంధించి ఏర్పాట్లను ఆర్డీఓ వేణుమాధవ్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు, అభ్యర్థుల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లు, ఫర్నిచర్, భద్రతా చర్యలను త‌నిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో సాగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జానయ్య రిటర్నింగ్ అధికారి నారాయణ దాస్ రమేష్ తహసీల్దార్ దారవత్ లాలూ నాయక్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.