09-10-2025 08:16:04 PM
కుభీర్‌లో బాకీ కార్డుల పంపిణీ..
కుభీర్ (విజయక్రాంతి): కుభీర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ బాకీ కార్డులను గ్రామస్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కిరణ్ కొమ్రేవార్, మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్‌తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఖాళీ మాటలుగానే మిగిలిపోయాయని, ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కృషి చేస్తోందని తెలిపారు.