27 April, 2026 | 12:22 PM

కార్మిక చట్టాలు కార్పొరేట్ శక్తులకు తాకట్టు

11-05-2024 12:06 AM

సీపీఎం ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్‌ను గెలిపించాలి

సీపీఎం పార్టీ జిల్లా కమిటి సభ్యులు పీ అంజయ్య 

ఇబ్రహీంపట్నం, మే 10 (విజయక్రాంతి): భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గం సీపీఎం పార్టీ అభ్యర్థి కామ్రేడ్ ఎండీ జహంగీర్ ని గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పీ అంజయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జహంగీర్‌కు మద్దతుగా ధర్మన్నగూడ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చౌదర్‌పల్లి, తమ్మలోనిగూడ గ్రామా ల్లో ఉపాధిహామి కూలీలను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా పీ అంజయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తున్నదని, కార్మిక కర్షక ఉపాధి హామి లాంటి చట్టాలను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతూ, ప్రజల మీద మోయలేని భారం మోపిందని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుధర్మశాస్త్రం అమలు చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయనందున, ఈ ఎన్నికల్లో మళ్లీ గెలవడం కష్టమని తెలిసి, మోసపూరిత వాగ్దానాలతో ముందుకు వస్తున్నారని, ప్రజలు ఆలోచించి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.

ప్రజా వ్యతిరేక పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఓడించి, ఎర్రజెండా ముద్దుబిడ్డ, నిరంతరం ప్రజల కోసం కొట్లాడే ఎండీ జహంగీర్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ వైస్ ఎంపీపీ ఎం. శ్రీమన్నారాయణ, పార్టీ మండల కార్యవర్గ సభ్యులు జంగయ్య, చందునాయక్, మండల నాయకులు ఎ. మల్లేష్, ధర్మన్నగూడ సీపీఎం పార్టీ కార్యదర్శి రమేష్, పార్టీ నాయకులు రాములు, బీమయ్య తదితరులు 

పాల్గొన్నారు.