27 April, 2026 | 2:34 PM

మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే... సీఎం కేసీఆరే

27-04-2026 12:55 PM

తాండూర్ లో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

తాండూరు,(విజయక్రాంతి): రాబోయే శాసనసభ ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని... కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అని తాండూర్ గడ్డపై మరోసారి ఎమ్మెల్యే అయ్యేది పైలట్ రోహిత్ రెడ్డి విజయం ఖాయమని వికారాబాద్ జిల్లా తాండూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్నారు. సోమవారం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం(BRS Party Formation Day Celebrations) సందర్భంగా  తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నాయకులు జెండా ఆవిష్కరణ చేసి మిఠాయిలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్,  పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్ , సీనియర్ నాయకులు మంజుగుల విట్టల్ రెడ్డి , మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కోత్రిక విజయలక్ష్మి,  సాయి పూర్ నరసింహులు , మున్సిపల్ కౌన్సిల్ ఫోర్ లీడర్ దీప తదితరులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మధ్య దళారులు లేకుండా ప్రతి పేదవాడికి అందాయని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే వారని. . ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి, మోసాలు చేసి.. 6 గ్యారంటీలు ఇస్తామని అబద్ధాలు చెప్పి....అధికారంలోకి వచ్చి 3సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్ని వర్గాల ప్రజలు నిరాశ , నిస్సృహాలతో ఉన్నారని ఆరోపించారు.

420 హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి  చెప్తారని అన్నారు. నియోజకవర్గంలో పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీని పటిష్టం చేసి. . తాండూర్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేస్తామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శోభారాణి,వీరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు నవీన, సుప్రియ, నాగలక్ష్మి, జావేద్, యోగానంద్, సురేష్ నాయక్, నాయకులు ఇర్ఫాన్, బషారత్ అలీ, సలీం, సంతోష్ గౌడ్, రుద్రు పాటిల్, ఇంతియాజ్, భీమ్ సింగ్, అనంత రెడ్డి,  టిఆర్ఎస్వి దత్తాత్రేయ, ఇబ్రహీం, వినోద్, సోహెబ్, బాంబినో, కోట్రీకే శ్రీకాంత్, ఫైసల్ ఖాన్, అస్ఫక్ తదితరులు పాల్గొన్నారు.