పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం
టి.పి.సి.సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
లబ్ధిదారులకు ఇంటికి సంబంధించిన వంట సామాగ్రి పంపిణీ
కామారెడ్డి, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): కామారెడ్డి నియోజకవర్గ వర్గం లోని బిబిపేట్ మండలం తుజాల్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ఇంటికి సంబంధించిన వంట సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ద్వారా నిరుపేదలకు అండగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందున్నారన్నారు.
సొంత స్థలం లేని వారికి ఇంటి నిర్మాణం కోసం త్వరలో ప్రభుత్వము ఒక ప్రకటన చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మామిళ్ళ అంజన్న, జిల్లా ఉ పాధ్యక్షులు, పంపరి లక్ష్మణ్, మున్సిపల్ కౌన్సిలర్లు, గడ్డమీది మహేష్, క్రేడా అధ్యక్షులు లక్ష్మి నర్సాగౌడ్, మాజీ కౌన్సిలర్లు, సలీం, పిడుగు సాయిబాబా,మామిళ్ళ రమేష్, నర్సొల్ల మహేష్, వార్డ్ మెంబర్, కుమార్, యూత్ ప్రెసిడెంట్,ద్రావిడ్, కోటేశ్వర్ రాజశేఖర్, బండారి శ్రీకాంత్, నిరంజన్, రాహుల్ , తదితరులు పాల్గొన్నారు.






