విద్యుత్ షాక్ తో మహిళ మృతి
27-04-2026 12:47 PM
విద్యుత్ షాక్ తో చింతకుంట్ల పున్నమ్మ మృతి.
తుంగతుర్తి( విజయ క్రాంతి): విద్యుత్ షాక్ గురై ఓ మహిళ మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపి వివరాల ప్రకారం...గొట్టిపర్తి గ్రామానికి చెందిన చింతకుంట్ల పున్నమ్మ తన ఇంటిలో బోర్ వేద్దామని పోవుచుండగా ప్రమాదవశాత్తు, విద్యుత్ వైరు కాలికి తగలడంతో, కరెంటు పాసై పడిపోయింది. దవాఖానకు తరలించి, వైద్యం చేస్తుండగా మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీనితో గొట్టిపర్తి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి, ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు కలరు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.






