25 March, 2026 | 2:51 AM

కట్టుబట్టలతో వీధినపడ్డ పేద కుటుంబం

25-03-2026 01:08 AM

షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం!

షాద్నగర్, మార్చి 24 (విజయక్రాంతి): షాద్ నగర్ పట్టణం నెహ్రూ కాలనీలో చో టుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం ఒక పేద కుటుంబాన్ని రోడ్డున పడేసింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పిట్టల శీను అనే హమాలీ కార్మికుడి ఇల్లు పూర్తిగా కాలి బూడిదయ్యింది.నెహ్రూ కాలనీలోని 19వ వార్డు లో ఉన్న శీను, విజయలక్ష్మి దంపతుల రేకు ల షెడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

నిమిషాల వ్యవధిలోనే ఇల్లు మొత్తం కాలిపోవడంతో, అల్మారీలో దాచుకున్న రూ. 60 వేల నగదు, కీలక పత్రాలు, బట్టలు, నిత్యావసర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. కూలి పనులు చేసుకునే ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు (ఒకరు ఇంటర్, మరొకరు 5వ తరగతి) ఉన్నారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలలేదు.

అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు

సమాచారం అందుకున్న మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, కౌన్సిలర్లు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ము న్సిపల్ చైర్మన్ బాధితులకు తక్షణ సాయం గా రూ. 5,000 నగదు అందజేశారు.బాధిత కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ’ఇందిరమ్మ ఇల్లు’ మంజూరయ్యేలా కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఆ పేద కుటుంబానికి ప్రభుత్వం మరియు దాతలు మరింత సాయం అందించి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.