17 April, 2026 | 2:28 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

అ‘పూర్వ’ వేడుక

09-06-2025 12:35 AM

కరీంనగర్, జూన్ 8 (విజయ క్రాంతి): 20 ఏండ్ల తర్వాత ఆ విద్యార్థులంతా కలుసుకున్నారు.. పది తర్వాత తమ చదువులు, జీవితాల్లో స్థిరపడేందుకు పడ్డ కష్టాలను ఒకరికొకరు చెప్పుకొన్నారు. బడిలో చిన్ననాటి అనుభవాలను నెమరు వేసుకొన్నారు.

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెర్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2004-05 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను సన్మానించారు. ఉపాధ్యాయులు, తమ మిత్రులతో అనుబంధాన్ని నెమరు వేసుకొన్నారు.   ఉపాధ్యాయులు సత్యం, లక్ష్మణ్, సత్యనారాయణ,  సుధాకర్, శాస్త్రి, శ్రీనివాస్ కు విద్యార్థులుపాదపూజచేశారు.