03-02-2026 09:25:37 PM
వకీల్ పల్లి మైన్ లో ఆర్జీ-2లోని సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ ఖాళీలను వకీల్ పల్లి మైన్ ఉద్యోగులతో మాత్రమే నింపాలి
మంథని,(విజయ క్రాంతి): వకీల్ పల్లి మైన్ లో ఆర్జీ-2 లోని సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ ఖాళీలను వకీల్ పల్లి మైన్ ఉద్యోగులతో మాత్రమే నింపాలని, అన్ని ఏరియాల ఉద్యోగులకు అవకాశం కల్పిస్తూ కొత్తగా ఇచ్చిన సర్క్యులర్ను రద్దు చేయాలని, పై క్యాటగిరిలో పనిచేసే ఉద్యోగులకు సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ ప్రమోషన్ కి వస్తే బేసిక్ ప్రొటెక్షన్ కల్పించాలని, స్టాచుటరి ట్రేనింగ్ చేసిన ఉద్యోగులకు రికవరీ చేసిన జీతమును వెంటనే చెల్లించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేసి మేనేజర్ కు మెమోరాండం అందించారు.
సత్తుపల్లిలో సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ ఖాళీలను కొత్తగూడెం డివిజన్ వాళ్లతో నింపడానికి సర్కులర్ ఇచ్చిన యాజమాన్యం ఆర్జీ-2లోని సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ ఖాళీలను సింగరేణిలోని అన్ని ఏరియాల నుండి నింపడానికి సర్కులర్ ఇవ్వడాన్ని గుర్తింపు సంఘం ఏఐటియుసిగా తీవ్రంగా ఖండిస్తున్నదని, గతంలో మాదిరిగా అర్జీ-2 లోని అర్హత గల కార్మికులతోనే ఆర్జి- 2 లోని సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ ఖాళీలు నింపాలని డిమాండ్ చేశారు. పై క్యాటగిరిలో పనిచేస్తున్న ఉద్యోగులు సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ గా సెలెక్ట్ అయిన వారికి బేసిక్ ప్రొటెక్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వకీల్ పల్లి మైన్ లో స్టాచ్యుటరి ట్రైనింగ్ చేసిన ఉద్యోగులకు వారి జీతాలను రెండు నెలల నుండి మొత్తానికి మొత్తంగా రికవరీ చేసి జీరో పేమెంటు వచ్చేలా చేసిన యాజమాన్య చర్యను తీవ్రంగా ఖండించారు. రికవరీ చేసిన జీతాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్ ప్రకాష్, బ్రాంచ్ కార్యదర్శి జీగురు రవీందర్, బ్రాంచ్ ఉపాధ్యక్షులు బి అన్నారావు, బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు మామిడి మహేందర్, బొట్ల సంపత్, పిట్ కార్యదర్శి బొంత రాజు,నాయకులు వెంకటేష్, నరేష్, భూమయ్య, రాకేష్ , నాగరాజు, శ్యాం, అజయ్, అభినవ్, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.