calender_icon.png 3 February, 2026 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిపిఎం అభ్యర్థిని గెలిపించండి

03-02-2026 09:29:02 PM

అభివృద్ధి చేసి చూపిస్తాం, జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు 

పాల్వంచ, (విజయక్రాంతి): పాల్వంచ టౌన్ 31వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సిపిఎం అభ్యర్థి కే సత్య మంచి కంటి నగర్ లో విస్తృత సమావేశం పార్టీ పట్టణ కార్యదర్శి పి తులసి రామ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడిన జిల్లా కార్యదర్శి మచ్చవెంకటేశ్వర్లు అన్నవరపు కనకయ్య ఏజే రమేష్ మాట్లాడుతూ... 23 సంవత్సరాల క్రితం పేదలను సమీకరించి ఇంటి స్థలం లేని పేదలకు ఇళ్ల స్థలాలు పంచినపార్టీ అనేక పోరాటాల ద్వారా గ్రామాభివృద్ధికి కృషి చేసిన పార్టీ సిపిఎం పార్టీ మాత్రమే అని ఎన్నికల్లో మా పార్టీని గెలిపిస్తే డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలను అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలందరూ ఐక్యమత్యంతో పార్టీని గెలిపించుకోవాలని ప్రజా పోరాటాలతో సంబంధం లేని వారు కల్లబొల్లి కబుర్లతో వాగ్దానాలు చేసి ప్రజలను గందరగోళం పరిచే అవకాశం ఉంటుందని అలాంటి వాళ్ళ చేతుల్లో డివిజన్ భవిష్యత్తుని పెట్టవద్దని పోరాడే పార్టీకే పట్టం కట్టాలని నాయకులు కోరారు. పార్టీ అభ్యర్థి కే.సత్య మాట్లాడుతూ... డివిజన్లో ఉన్న ప్రజలందరినీ కలుపుకొని పని చేస్తానని అందరూ తన గెలుపుకి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రతి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డ రవి కొండబోయిన వెంకటేశ్వర్లు పార్టి సీనియర్ నాయకులు ఎం వి అప్పారావు, రాందాస్ పార్టీ నాయకులు ఎస్కే నిరంజన్ సత్యవాణి నింజా రాములు సులోచన కాంతి బి మాధవి ఐద్వా నాయకులు ఎస్ లక్ష్మి బి నరసింహ తదితరులు పాల్గొన్నారు