అర్హులలందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రజా ప్రభుత్వం
వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు..
హనుమకొండ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు పాలనపరమైన ఇబ్బందులు కలగకుండా నేడు హసన్ పర్తి మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ శాఖ పరిధిలోని ఏంజిఎన్ఆర్ ఈజిఎస్ 20 లక్షల రూపాయల నిధులతో గ్రామ పంచాయతీ భవనానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు(MLA KR Nagaraju) కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసారు. తొలుత గ్రామ మహిళామణుల కోలాటాలతో ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి ఘనస్వాగతం పలికారు.
అనంతరం పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కను నాటి పర్యావరణాన్ని రక్షించాలని గ్రామస్తులతో కలిసి ప్రతిజ్ఞ చేసిన ఎమ్మెల్యే నాగరాజు, అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంతన్న నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం జోడేడ్ల మాదిరి సాగుతున్నాయని పేర్కొన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు అందిచామని, రైతులకు రైతు రుణమాఫీ చేసిన ప్రజా ప్రభుత్వం, రైతులకు ఆత్మీయ భరోసా, మహిళలకు పెద్ద పీట వేస్తూ కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఏఎంసి వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు జోరిక పూల, గ్రామ పార్టీ అధ్యక్షుడు బొక్క చిరంజీవి, యూత్ నాయకులు మంద రాజు, జట్టి యుగేందర్, నితిన్ రెడ్డి, తో పాటు మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






