19-12-2025 01:04:02 AM
మాజీ ఎమ్మెల్యే జి విట్టల్‌రెడ్డి
తానూరు, డిసెంబర్ 18 (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ఎన్నికైన వారు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభు త్వ పథకాలను ప్రజలకు అందించాలని ముథో ల్ మాజీ ఎమ్మెల్యే జి విట్టల్‌రెడ్డి అన్నారు.
గురువారం మండలంలో సర్పంచ్‌గా ఎన్నికైన కాంగ్రెస్ మద్దతుదారులు విట్టల్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు విట్టల్ రెడ్డి సన్మానం చేసి ప్రజల కోసం కష్టపడి పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ఉన్నారు.