calender_icon.png 12 November, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంట్లో దూరిన కొండచిలువ..

12-11-2025 07:36:50 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం కోక్యతండా గ్రామంలో గుగులోత్ కుమార్ ఇంట్లో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కొండచిలువ దూరింది. అయ్యప్ప మాల వేసుకున్న స్వామి కుమార్ ఇంట్లో నేలమీద పడుకోగా, కుమార్ మీదుగా కొండచిలువ వెళ్లింది. మెలకువ వచ్చి చూడగా.. పాము కనిపించింది. చుట్టుపక్కల సాయంతో కొండచిలువను హతమార్చారు. గ్రామంలో స్ట్రీ లైట్స్ లేకపోవడంతో విషసర్పాలు ఇంట్లోకి వస్తున్నాయని, లైట్ల విషయం పంచాయతీ సెక్రెటరీకి చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.