24 June, 2026 | 12:41 AM

అరుదైన తలసేమియా సమస్య

24-06-2026 12:00 AM

34 ఏళ్ల యువకుడికి కేర్ ఆస్పత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): తలసేమియాతో సంబంధం ఉన్న అరుదైన సమస్య కారణంగా నడవలేని స్థితికి చేరుకున్న 34 ఏళ్ల యువకుడికి కేర్ హాస్పిటల్స్ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి కొత్త జీవితం ప్రసాదించారు. మణికొండకు చెందిన సర్ఫరాజ్ టక్కలపల్లి వెన్నుముకపై ఏర్పడిన అసాధారణ కణజాల ఒత్తిడి కారణంగా నడకలో అసమతుల్యత, కాళ్ల బలహీ నత, మూత్ర నియంత్రణ కోల్పోవడం వం టి సమస్యలతో బాధపడుతూ కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీని ఆశ్రయించారు.

వైద్య పరీక్షల్లో తలసేమియా కారణంగా వెన్నెముక ప్రాంతంలో అసాధారణ రక్తకణాల ఉత్పత్తి కణజాలం పెరిగి ఒత్తిడి తెస్తున్నట్లు గుర్తించారు. చికిత్స ఆలస్యమైతే పక్షవాతం, శాశ్వత వైకల్యం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. కేర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ స్పున్ సర్జన్ డా. గోపరాజు ప్రవీణ్ నేతృత్వంలో, అనస్థీషియా బృందం సహకారంతో క్లిష్టమైన స్పున్ సర్జరీ నిర్వహించి వెన్నుపాముపై ఒత్తిడిని తొలగించారు.

సకాలంలో శస్త్రచికిత్స చేయడం వల్ల శాశ్వత నరా ల నష్టాన్ని నివారించి రోగి నడక సామర్థ్యాన్ని పునరుద్ధరించగలిగామని డా. గోపరా జు ప్రవీణ్ తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం ఫిజియోథెరపీ సహాయంతో రోగి మళ్లీ స్వతంత్రంగా నడవగలుగుతున్నారని, ప్రస్తు తం సాధారణ జీవితానికి తిరిగి చేరుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.