24 June, 2026 | 1:42 AM

హోర్ముజ్ దాటిన 11 నౌకలు

24-06-2026 12:40 AM

భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జూన్ 23 (విజయక్రాంతి): భారతీయ జెండాలున్న 11 నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటాయని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు. అమెరికా శాంతి ఒప్పందం తరువాత పశ్చిమాసియాలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని మంగళవారం మీడియాకు వివరించారు.

దేశ ప్రయోజనాలకు అనుగుణంగా చమురు దిగుమతి చేసుకుంటామన్నారు. ఆరు ఎరువు సరఫరా నౌకలు, నాలుగు ముడి చమురు నౌకలు, ఒక ఎల్పీజీ నౌక జలసంధిని దాటాయని వివరించారు. మిగిలిన నౌకలు కూడా త్వరలోనే జలసంధిని దాటుతాయన్నారు. ఇంకా పది నౌకలు గల్ఫ్‌లోనే ఉన్నాయని, రెండు నౌకలు అక్కడకు చేరుకున్నాయని చెప్పారు. 

140 కోట్లమంది పౌరులకు తక్కువ ధరలోనే ఇంధనం అందించడం ప్రభుత్వ విధానమన్నారు. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా విధించిన ఆంక్షల గడువు వారం క్రితమే ముగిసిందని, ఇరాన్ సంస్థల నుంచి కొనుగోలు చేసేందుకు భారతీయ కంపెనీలకు అవకాశం లభించిందని జైస్వాల్ పేర్కొన్నారు.