యువతలో ఊబకాయం ముప్పు
- నిపుణుల హెచ్చరిక
- కామినేని ఆస్పత్రిలో వెయిట్ లాస్ సెంటర్
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): యువతతో పాటు అన్ని వయసుల వారిలో ఊబకాయం వేగంగా పెరుగుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఊబకాయం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్, నిద్ర సమస్యలు, కీళ్ల నొప్పులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు.
కామినేని ఆస్పత్రిలో ప్రారంభించిన వెయిట్ లాస్ సెం టర్‌లో శాశ్వత బరువు నియంత్రణ కోసం ఎండోక్రైనాలజిస్టులు, డయాబెటాలజిస్టులు, న్యూట్రిషనిస్టులు, ఫిజియోథెరపిస్టులు, సైకాలజిస్టులు, జెనెటిక్, బారియాట్రిక్ నిపుణులు కలిసి సమగ్ర సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బి. శ్రావ్య మాట్లాడు తూ.. ఊబకాయాన్ని దీర్ఘకాలిక వ్యాధిగా పరిగణించాలని సూచించారు.
డాక్టర్ భవాని మాట్లాడుతూ.. భారతదేశంలో 25 కోట్ల మందికి పైగా ఊబకాయంతో బాధపడుతున్నారని, ముఖ్యంగా చిన్నారులు, యువత లో ఇది పెరుగుతోందని తెలిపారు. డాక్టర్ డి. శ్రీనాగవాణి బరువు నియంత్రణలో క్ర మబద్ధమైన వ్యాయామం కీలకమని చెప్పారు.
బి. సంతోష మాట్లాడుతూ.. వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన పోషకాహార ప్రణాళికలు ఊబకాయం నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తాయని వివరించారు. ఈ కేంద్రంలో ఊబకాయంపై సమగ్ర మూల్యాంకనం, శరీర నిర్మాణ విశ్లేషణ, పోషకాహార సలహాలు, వ్యాయామ కార్యక్రమాలు, వైద్య చికిత్సలు మరియు దీర్ఘకాలిక ఫాలోఅప్ సేవలు అందుబాటులో ఉంటాయని వైద్యులు తెలిపారు.






