calender_icon.png 2 February, 2026 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాగృతి పార్టీ అధ్యక్షురాలు కవితను కలిసిన ఆత్మకూర్ వాసి

02-02-2026 12:00:00 AM

తెలంగాణ జాగృతి మండల అధ్యక్షులుగా గౌరుగారి సుభాన్‌రెడ్డి

నాగిరెడ్డిపేట్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): తెలంగాణ జాగృతి పార్టీ అధ్యక్షురాలు కవితక్కను కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఎదు రుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యం లో మండలంలోని ఆత్మకూరు గ్రామ చెందిన గౌరీగారి సుభాన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలంగాణ జాగృతి పార్టీ నాగిరెడ్డిపేట్ మండల అధ్యక్షులుగా గౌరీగారి సుభాన్ రెడ్డి రెడ్డిని నియమించినట్లు తెలంగాణ జాగృతి పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్ తెలిపారు.

గౌరీగారి సుభాన్ రెడ్డి జాగృతి మండల అధ్యక్షులుగా నియమితులైనందున మండలంలో పలువురు అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా గౌరీగారి సుభాన్ రెడ్డి తనకు మండల బాధ్యతలు అప్పజెప్పినందుకు కవితక్కకు,జిల్లా అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.