calender_icon.png 2 February, 2026 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో అనాథ మృతి

02-02-2026 12:00:00 AM

ఆకలి, అనారోగ్యం, చలి కారణమనే అనుమానం

శేరిలింగంపల్లి, పిబ్రవరి 1 (విజయక్రాంతి): లింగంపల్లి రైల్వే స్టేషన్లో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ప్లాట్ఫామ్ నంబర్6 వద్ద నిద్రించే ప్రాంతంలో ఒక వ్యక్తి కదలకుండా పడి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా, సుమారు 45 నుంచి 50 ఏళ్ల వయసున్న పురుషుడు మృతి చెందినట్లు గుర్తించారు.

మృతుడు తెలుపు చొక్కా, నలుపు ప్యాంటు ధరించి ఉండగా, ఎత్తు సుమారు ఐదు అడుగుల రెండు అంగుళాలు, మధ్యస్థ వర్ణంతో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదన్నారు. విచారణలో గత నెల రోజులుగా స్టేషన్ పరిసరాల్లో భిక్షాటన చేస్తూ అక్కడే ఉంటున్నాడని, సరైన ఆహారం తీసుకోకపోవడం, అనారోగ్యం, చలిని తట్టుకోలేకపో వడం వల్లే మృతి జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. ఘటనపై చందానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించినట్లు పోలీసులు తెలిపారు.