6 April, 2026 | 4:56 AM

రిటైర్డ్ ఉద్యోగి సామాజిక బాధ్యతను కొనసాగించాలి

06-04-2026 01:51 AM

యాదవ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బడుగుల సైదులు

కోదాడ, ఏప్రిల్ 5 : రిటైర్డ్ ఉద్యోగి సామాజిక బాధ్యతను కొనసాగించాలని కోదాడ డివిజన్ యాదవ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బడుగుల సైదులు అన్నారు. ఇటీవల కరక్కాయలగూడెం ఉన్నత పాఠశాలలో ఉద్యోగ విరమణ పొందిన హిందీ ఉపాధ్యాయులు బొల్లం వెంకటేశ్వర్లు ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమం ఆదివారం కోదాడ పట్టణంలో పద్మావతి నగర్ లో నిర్వహించారు.   

యాదవ ఉద్యోగుల సంఘం కోదాడ డివిజన్ ఆధ్వర్యంలో  రిటైర్డ్ ఉపాధ్యాయుడు బొల్లం వెంకటేశ్వర్లు ను ఘనంగా శాలువా ,మెమొంటో, పూలదండలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  యాదవ ఉద్యోగుల సంఘం బాధ్యులు  నక్క శ్రీనివాస్, రాజుల లక్ష్మీనారాయణ, గడ్డం చిరంజీవి ,ఎల్లావుల సైదులు,కోదండరామయ్య,గంగయ్య, బంధుమిత్రులు , శిష్యులు, ఉత్తం పద్మావతి నగర్ కాలనీవాసులు పాల్గొన్నారు.